టేకులపల్లి: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

76చూసినవారు
టేకులపల్లి: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
బైక్ అదుపు తప్పడంతో విద్యార్థి మృతి చెందిన సంఘటన టేకులపల్లి మండల పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. బర్లగూడెం పంచాయతీ మొట్లగూడెంకు చెందిన రోహిత్(19) టేకులపల్లి ఈఎంఆర్ఎస్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలోనే రోహిత్ మొట్లగూడెం నుంచి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. కారేపల్లి తండా సమీపంలో బైక్ అదుపు తప్పి క్రింద పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్