AP: టిడ్కో ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు మంత్రి నిమ్మల రామానాయుడు శుభవార్త చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో టిడ్కో ఇళ్లను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టి రూ. 5 వేల కోట్లను రుణం తీసుకుని.. పక్కదారి పట్టించారని ఆరోపించారని నిమ్మల పేర్కొన్నారు.