గుర్‌ప్రీత్‌సింగ్ గురించి తెలుసా?

82చూసినవారు
గుర్‌ప్రీత్‌సింగ్ గురించి తెలుసా?
భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్‌గా నియమితులైన గుర్‌ప్రీత్‌సింగ్ మొహాలీలో జన్మించారు. 9వ ఏటనే ఫుట్‌బాల్ ఆడటం మొదలెట్టారు. చండీగఢ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 2011 నుంచి ఇప్పటివరకు ఇండియా తరఫున 72 మ్యాచులు ఆడారు. IND U19, IND U13 జట్లకూ ప్రాతినిధ్యం వహించారు. UEFA యూరోప్ లీగ్‌లో ఆడిన తొలి భారత ప్లేయర్‌గా, ఐరోపాలో ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆడిన ఐదో భారత ఆటగాడిగా నిలిచారు. ISLలో బెంగళూరు టీమ్‌కు ఆడుతున్నారు.

సంబంధిత పోస్ట్