AP: సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబుకు నిజంగా బుద్ధి, జ్ఞానం లేవంటూ ఆరోపించారు. అధికార అహంకారంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూశారన్నారు. నిజంగా ఇది ధర్మమేనా? న్యాయమేనా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో ఎక్కడా ఒక నాయకుడిలా వ్యవహరించలేదని మండిపడ్డారు.