అంధకారంలో గ్రామం

68చూసినవారు
వాంకిడి మండలం సరండి గ్రామంలో ఆదివారం సాయంత్రం నుంచి గ్రామం అంధకారంలో ఉందని గ్రామ ప్రజలు వ్యాపోతున్నారు. గాలివాన ఈదురుగాలులు వర్షం కురిసిన ప్రతిసారి గ్రామంలో విద్యుత్ అంతరాయం తరుచుగా ఉంటుందని అన్నారు. చిన్నపాటి గాలి వర్షానికి సైతం గ్రామంలో విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. గ్రామంలో ఎక్కడైనా ఈదురుగాలులకు, వర్షం వచ్చిన ప్రతిసారీ విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు.

సంబంధిత పోస్ట్