ఈదురు గాలులకు ఎగిరిపడిన వృద్ధురాలు

1044చూసినవారు
ఈదురు గాలులకు ఎగిరిపడిన వృద్ధురాలు
కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం బురుగూడ గ్రామంలో బుధవారం సాయంత్రం 5గంటలకు ఈదురు గాలులకు బురుగూడకి చెందిన వృద్ధురాలు చున్నూబాయి ఎగిరి పడింది. సాయంత్రం వర్షం కురుస్తుండడంతో వృద్ధురాలు చున్నూబాయి ఇంటి ముందు నిలబడి ఉంది. ఈదురుగాలులు బలంగా వీయడంతో చున్నూబాయి ఎగిరిపడి ముళ్ల కంపలో చిక్కుకుంది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యయి. వెంటనే ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్