కాగజ్ నగర్ రూరల్ మండలంలో 500లకు పైగా
బీజేపీ సభ్యత్వాలు చేసినందుకు బుధవారం జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు పుల్ల అశోక్ ను శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్, సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు, ఇన్‌చార్జ్ మల్లారెడ్డి, కొంగ సత్యనారాయణ, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.