హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడ కత్రియా హోటల్ లో ఆదివారం బీజేపి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన, 6 గ్యారంటీలపై ఛార్జ్ షీట్ విడుదల కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేక పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఎంపీలు ఎమ్మెల్యెలు తదితరులు పాల్గొన్నారు.