నేడు జిల్లాకి రానున్న సీఎం రేవంత్ రెడ్డి

7254చూసినవారు
నేడు జిల్లాకి రానున్న సీఎం రేవంత్ రెడ్డి
కొమురంభీమ్ జిల్లా కు గురువారం సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున ఆసిఫాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ఆసిఫాబాద్ రానున్నట్లు నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. ఆత్రం సుగుణ సొంత ప్రాంతం కావడం వల్ల సీఎం సభకు భారీ స్థాయిలో జనసమీకరణ చేసి సత్తా చాటాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్