ఆసిఫాబాద్ నియోజకవర్గం కెరామెరి మండలం అనార్పల్లి వాస్తవ్యులు రాథోడ్ తారాబాయి మీట్టు నాయక్ ముద్దుల మనవరాలు లక్ష్మి మోహన్ దంపతుల ముద్దుల కుమార్తె రాథోడ్ అనన్య కర్ణవేదన మహోత్సవ వేడుకలు ఆదివారం వారి స్వగృహం నందు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా దివ్యశ్రీ ఫౌండేషన్ చైర్మన్ ధారావత్ ప్రవీణ్ నాయక్ హాజరై చిన్నారి చిట్టితల్లినీ కట్న కానుకలతో శుభాకాంక్షలు తెలీపి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట రాథోడ్ శేషరావు నాయక్, ధారావత్ ఉల్లాస్ నాయక్, గ్రామ పెద్దలు, యువజన సభ్యులు తదితరులు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించడం జరిగింది.