ఆటో, క్యాబ్, టాక్సీ డ్రైవర్ల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 7న జరగనున్న బంద్ ను విజయవంతం చేయాలని ఏఐటీయుసి యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం కొమురంభీం జిల్లా కార్యదర్శి ఉపేందర్ ఆధ్వర్యంలో బంద్ వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు రూ. 15వేలు, ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్లకు రూ. 10లక్షలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.