కుల, మతాల కంటే మానవత్వం గొప్పదని అంటున్నారు రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ. తాజాగా బుధవారం లింగాపూర్ మండల కేంద్రానికి చెందిన పేద ముసలమ్మ జాటోత్ రాజలీ బాయి (69) గత కొద్దిరోజుల క్రితం పొలం పనులకు వెళ్లగా ఆకస్మికంగా కాలు జారి పడిపోవడంతో ఎడమ చేయి పూర్తిగా విరిగిపోయింది. విషయం తెలుసుకున్న చైర్మన్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ స్వయంగా ఇంటికొచ్చి రూ. 5000 ఆర్థిక సహాయాన్ని అందించి మనోధైర్యాన్నిచ్చారు.