లింగాపూర్ మండల కేంద్రానికి చెందిన ఆడే సక్రిబాయి గత కొద్ది సంవత్సరాలుగా వృద్యాప్య స్థితిలో ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఈ మధ్య కాలంలో ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నది. ఆ ముసలి తల్లి ఇల్లు గడవడానికి చాలా కష్టతరం అయితుంది. కనీస సౌకర్యాలు లేని స్థితిలో జీవిస్తున్న ఆమెను గుర్తించి స్థానిక స్వచ్ఛంద సంస్థ సామాజిక సేవకుడు జాటోత్ దవిత్ కుమార్ రెహమాన్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందించారు.