దహేగాం మండలంలో పెద్దవాగు వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలను సిర్పూర్ శాసనసభ్యులు కోనేరు కోనప్ప పరిశీలించారు. మండలంలోని బీబ్రా గ్రామ సమీపంలో వరద ఉధృతికి తెగిపోయిన రోడ్డును పరిశీలించి, వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లను తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం వరదల వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వెంటనే నష్టపోయిన రైతులు వివరాలు సర్వే చేసి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, రైతు బంధు అధ్యక్షులు సంతోష్ గౌడ్, అధికారులు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.