బెజ్జుర్ మండల కేంద్రంలోని యస్. వి ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ వేడుకల్లో గిరిజన సంక్షేమ శాఖ చైర్మన్ కొట్నాక్ తిరుపతి, ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు సరైన పాలన అందుతుందన్నారు.