వాంకిడి మండలంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న వాలిబాల్ టోర్నమెంట్ పోస్టర్లను మంగళవారం రోజున వాంకిడి ఎస్సై ప్రశాంత్ కుమార్ వాలిబాల్ నిర్వాహాకులతో కలిసి స్థానిక పోలీస్ స్టేష్టన్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ యువతకు వ్యసనాలకు దూరముగా ఉండి క్రీడా పోటీల్లో పాల్గొనాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దీపక్ ముండే తదితరులు ఉన్నారు.