రెబ్బెన, గోలేటి గ్రామపంచాయతీ దుగ్గపూర్ గ్రామంలో రైతులతో కలిసి బుధవారం బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్ పంటలను పరిశీలించినారు. ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడానికి అందరికీ రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి, అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీకి భిన్నంగా ఇప్పుడు షరతులు ఎందుకు పెట్టారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు.