గుడిహత్నూర్ లో సంపూర్ణంగా బంద్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఆదివాసీ మహిళపై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ శుక్రవారం ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ, బాధిత మహిళకు న్యాయం చేయాలని, ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకొని నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.