ద్విచక్రవాహనం బోల్తా... ఒకరు మృతి
రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన దుర్గం బాపు శనివారం బైక్ పై కాగజ్నగర్ వెళ్తున్నాడు. ఇంద్ర నగర్ సమీపంలోని బ్రిడ్జ్ వద్ద బైక్ అదుపు తప్పి బోల్తా పడడంతో బాపుకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.