విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే

75చూసినవారు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం జీడిచేను గ్రామంలో శ్రీ శివకేశవ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన లక్కీ డిప్ కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఆలయ పునః నిర్మాణం కోసం ఈ లక్కీడిప్ నిర్వహించి నిధులు సేకరించడం అభినందనీయమన్నారు. కమిటీ సభ్యులు, బీజేపి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్