కాగజ్‌నగర్ పట్టణంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఎదుట. గత రెండు నెలలుగా మంచి నీటి పైప్ లైన్ లీక్ అవుతుంది. పలుమార్లు మున్సిపల్ అధికారులకు తెలిపినా మరమ్మత్తులు చేపట్టడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. శుక్రవారం మంచినీళ్ళు ఇలా వృధాగా పారుతూ కనిపించడంతో కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు.