కాగజ్నగర్: రైతు భరోసా అమలు చేయాలని బీఆర్ఎస్ ధర్నా
కాగజ్నగర్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఆదివారం బీఆర్ఎస్ నాయకులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా వెంటనే అమలు చేయాలని, జీవో 29ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.