సమంత విడాకులతో పాటు టాలీవుడ్ నుంచి చాలామంది హీరోయిన్లు వెళ్లిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణం అంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఈ కామెంట్స్ పై కేటీఆర్ స్పందించారు. 'నాపై చేస్తున్న అర్థం లేని అన్ని ఆరోపణలపై నా స్టాండ్ ఇదే' అంటూ ఓ పాత వీడియోను గురువారం 'ఎక్స్' వేదికగా షేర్ చేశారు. నిప్పు లేనిదే పొగరాదనే సామెతపై స్పందిస్తూ నీళ్లలో కూడా నిప్పులు పుట్టించవచ్చన్నారు.