కొండా సురేఖ వ్యాఖ్యలు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి

60చూసినవారు
కొండా సురేఖ వ్యాఖ్యలు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి 'X' వేదికగా స్పందించారు. 'సురేఖమ్మ, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది. కేటీఆర్ గురించి మీరు మాట్లాడింది ఆక్షేపణీయం. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు, తిరిగి ఆస్కారం ఇవ్వకూడదు. సమాజానికి ఆదర్శంగా ఉండాలి. మీరు చేసిన ఆరోపణ వల్ల కేటీఆర్ అమ్మ, భార్య, బిడ్డ, చెల్లి బాధపడరా? వాళ్లు ఆడబిడ్డలు కారా? ఒక తోటి మహిళగా మీరు ఆలోచించినారా?' అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్