అశ్వారావుపేట: వ్యవసాయ రంగంలో మరిన్ని పరిశోధనలు జరగాలి

55చూసినవారు
రైతులకు వ్యవసాయపరంగా అన్ని విధాల మేలు జరిగేలా వ్యవసాయ విద్యలో మరిన్ని పరిశోధనలు చేపట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం అశ్వరావుపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ కళాశాలలో సాగు చేస్తున్నటువంటి మియాజాకి మామిడి సాగును, ఇతర పంటల సాగును పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్