చంద్రుగొండ: పనులను వేగవంతం చేయాలి

80చూసినవారు
దత్తత గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధికారులను ఆదేశించారు. తాను దత్తతగా ఎంపిక చేసుకున్న చంద్రుగొండ మండలం తిప్పనపల్లి పంచాయతీ మహ్మద్నగర్ గ్రామాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. పనులు నాణ్యతలో ఏమాత్రం రాజీలేకుండా చేయాలన్నారు. గ్రామంలోని అన్ని వీధుల్లో తిరిగి గ్రామస్థుల ద్వారా పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్