అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీజ్

1077చూసినవారు
అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీజ్
అక్రమంగా మద్యం నిల్వ ఉంచిన బెల్టు దుకాణంపై ఎఫ్ఎస్ఈం, పోలీసులు సంయుక్తంగా దాడి చేసి కేసు నమోదు చేశారు. బుధవారం దమ్మపేట మండలం నెమలిపేటలో బెల్టు దుకాణంలో మద్యం నిల్వలు ఉన్నాయనే సమాచారం పోలీసులకు అందింది. ఎఫ్ఎస్టీం అధికారి కృష్ణ, ఎస్ఐ సాయికిశోర్రెడ్డి కలిసి ఆ దుకాణంపై దాడి చేసి, అక్రమంగా నిల్వ ఉంచిన 168 క్వార్టర్ సీసాలు, 12 బీర్లను
సీజ్ చేసి కేసు నమోదు చేశారు. మద్యం విలువ రూ. 36, 264 ఉంటుందని ఎస్ఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్