అనంతారం రెండు పడక గదుల ఇళ్ల వద్ద బురదమయం

56చూసినవారు
అనంతారం రెండు పడక గదుల ఇళ్ల వద్ద బురదమయం
అశ్వారావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్టు వరద ప్రభావిత ప్రాంతాలు కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నాయి. గుమ్మడవల్లి, నారాయణపురం, బచ్చువారిగూడెం రైతులు అత్యధికంగా నష్టపోయారు. ఆదివారం పెద్దవాగు, చిన్నవాగు వరద నీటి చేరికతో అనంతారం రెండు పడక గదుల ఇళ్లల్లో బురద పేరుకుపోయింది. అనంతారం సమీపంలోని రెండు పడక గదుల ఇళ్ల కాలనీవాసులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పండువారిగూడేనికి పరుగులు తీశారు.

సంబంధిత పోస్ట్