చక్కటి విద్యాబోధన చేసి గత సంవత్సరం రిజల్ట్ కంటే ఈ సంవత్సరం 100% రిజల్ట్ వచ్చేలా ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని ఐటీడీఏ పీవో బి. రాహుల్ అన్నారు. శుక్రవారం భద్రాచలం ఐటిడిఏ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల విద్యాధికారులతో పీఓ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమయానుకూలంగా విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు.