భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో బుధవారం ప్రారంభమైన ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు భద్రాద్రి రాముడు మత్స్య అవతారంలో ముస్తాబై భక్తులకు దర్శనమిచ్చారు. రామయ్యను భక్తుల జయ జయ ధ్వనుల మధ్య మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తోడుకొని వచ్చి మిధున స్టేడియంలోని మండపంలో స్వామివారిని భక్తుల దర్శనం కోసం ఆశీనులు చేశారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.