లైఫ్ జాకెట్లు లేకుండానే బోటింగ్

69చూసినవారు
లైఫ్ జాకెట్లు లేకుండానే బోటింగ్
భద్రాచలం రామయ్యను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు అధిక సంఖ్యలో గోదావరిలో బోటు షికారు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. అయితే బోట్ల నిర్వాహకులు పర్యాటకులకు భద్రతాపరమైన సదుపాయాలు కల్పించడం లేదు. నిబంధనల ప్రకారం ఒక బోట్లో 15మందిని మాత్రమే తరలించాల్సి ఉండగా అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో ఒక్కోసారి 30మందిని కూడా తీసుకెళ్తున్నారు. ఇక బోటింగ్ చేసేవారికి లైఫ్ జాకెట్లు ఇవ్వాల్సి ఉండగా ఏ ఒక్కరికీ అందించడం లేదు.

సంబంధిత పోస్ట్