అచ్యుతాపురంలో మలేరియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు

69చూసినవారు
అచ్యుతాపురంలో మలేరియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు
దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోగల అచ్యుతాపురం గ్రామంలో శనివారం మలేరియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి పుల్లారెడ్డి తెలిపారు. గ్రామంలో అసైన్థమేటిక్ ఫీవర్ సర్వే నిర్వహించి సుమారు 107మంది నుండి రక్త నమూనాలు సేకరించినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ గంగాధర్ గౌడ్, మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ రామకృష్ణ, ఏఎన్ఎం అనిత, ఆశా కార్యకర్త రమణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్