గంజాయి రవాణా కేసులో ఇద్దరికి 12 ఏళ్ల జైలుశిక్ష

73చూసినవారు
గంజాయి రవాణా కేసులో ఇద్దరికి 12 ఏళ్ల జైలుశిక్ష
గంజాయి రవాణా కేసులో ఇద్దరికి 12 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు చెరో రూ. లక్ష සරිమానా విధిస్తూ కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ బుధవారం తీర్పు చెప్పారు. భద్రాచలంలో 2023 జూన్ 16న వాహనాల తనిఖీల్లో గంజాయి తరలిస్తూ పట్టుబడిన భద్రాచలానికి చెందిన తాడి శివశంకర్, ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లా బాపనపల్లికి చెందిన ఆజగర్ ఖాన్ అలియాస్ సంతోష్ లకు పై విధంగా శిక్ష విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్