కామేపల్లి: రైతులు రుణమాఫీ కొరకు కుటుంబ సభ్యులను నిర్ధారణ చేసుకోవాలి
రుణమాఫీ కొరకు రైతులు కుటుంబ సభ్యులను నిర్ధారణ చేసుకోవాలని కామేపల్లి మండల వ్యవసాయ అధికారి బి. తారాదేవి శుక్రవారం కోరారు. సంబంధిత రైతులు ఒరిజినల్ ఆధార్ కార్డులు, ఆధార్ కార్డు జిరాక్స్ లతో రైతు వేదికకు వచ్చి ధ్రువీకరణ పత్రం పూర్తి చేసి కుటుంబ సభ్యులను నిర్ధారణ చేసుకోవాలని కోరారు. మండలంలో ఇంకా 430 మంది రైతులు కుటుంబ సభ్యులను నిర్ధారణ చేసుకోవలసి ఉన్నదని ఏవో తారా దేవి తెలిపారు.