ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. నేటి నుంచి అందుబాటులోకి పికప్‌ వ్యాన్‌లు

56చూసినవారు
ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. నేటి నుంచి అందుబాటులోకి పికప్‌ వ్యాన్‌లు
దూరప్రాంత ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ పికప్‌ వ్యాన్‌లను తీసుకొచ్చింది. శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో ఆర్టీసీ పికప్‌ వ్యాన్‌ల సేవలు అమల్లోకి వచ్చాయి. తొలి విడతలో ఈసీఐఎల్‌-ఎల్బీనగర్‌ మధ్య ఉన్న ప్రాంతాల నుంచి ఈ పికప్‌ వ్యాన్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు, కందుకూరు వెళ్లేవారి కోసం ఈ పికప్‌ వ్యాన్‌లు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలకు 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించాలని ఆర్టీసీ తెలిపింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్