క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయి

84చూసినవారు
క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయి
విద్యార్థులు విద్యారంగంతో పాటు క్రీడా రంగంలో రాణించాలని తాసిల్దార్ సిహెచ్ సుధాకర్, ఎస్సై బి. సాయి కుమార్, ఎంఈ ఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు, హెచ్ఎం ఏ. శైలజ పిలుపునిచ్చారు. కామేపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలను గురువారం వారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు రమణ, ఉపాధ్యాయుడు బాలాజీ, పీఈటీలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, విద్యార్థినిలు పాల్గొన్నారు.