చర్ల ప్రధాన రహదారిపై మొక్కలు నాటిన గ్రీన్ భద్రాద్రి

83చూసినవారు
చర్ల ప్రధాన రహదారిపై మొక్కలు నాటిన గ్రీన్ భద్రాద్రి
చర్ల ప్రధాన రహదారి వెంట గ్రీన్ భద్రాద్రి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మొక్కలు నాటారు. గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు ఉమా శంకర్ నాయుడు మాట్లాడుతూ, గత 12 సంవత్సరాల నుండి గ్రీన్ భద్రాద్రి సంస్థ పట్టణ ప్రముఖులు, దాతల సహకారంతో భద్రాచలం పట్టణంలోని అన్ని కాలనీలలో, రహదారుల వెంట వేలాది మొక్కలు నాటి, సంరక్షించి పెద్ద వృక్షాలుగా మార్చామన్నారు. అలాగే భద్రాచలం పట్టణాన్ని పచ్చని భద్రాద్రిగా చేయడమే తమ లక్ష్యం అని అన్నారు.