కొత్తగూడెం కోర్టులో ఘనంగా స్వతంత్ర దినోత్సవం వేడుకలు

1568చూసినవారు
కొత్తగూడెం కోర్టులో ఘనంగా స్వతంత్ర దినోత్సవం వేడుకలు
కొత్తగూడెం జిల్లా కోర్టులో శనివారం 74 వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా ఐదవ అదనపు జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. కోవిడ్ నిబంధనలకు లోబడి జరిగిన ఈ కార్యక్రమంలో జీల్లా జడ్జి మాట్లాడుతూ... దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ఎందరో త్యాగాథనుల ప్రాణ త్యాగంతో స్వతంత్రం సాధించామని అమరు తాగ్యాలను ఈ దేశ యూవత ఆదర్శంగా తీసుకుని, దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ సినియర్ సివిల్ జడ్జి జీ. శ్రీనివాస్, ప్రీన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి. శీరీష, జూనియర్ సివిల్ జడ్జి దేవి మానస, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉప అధ్యక్షుడు పి. నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి జే. గోపికృష్ణ, యస్&సి కార్యదర్శి యండి. సాదిక్ పాషా, కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్