కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెం స్మశానవాటికలో గురువారం గుర్తు తెలియని వ్యక్తులు నవజాత శిశువును వదిలి వెళ్లారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మూడో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శిశువును రామవరంలోని స్త్రీ మాత శిశు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.