శేష జీవితం సంతోషకరంగా గడపాలి: జిల్లా ఎస్పీ

601చూసినవారు
శేష జీవితం సంతోషకరంగా గడపాలి: జిల్లా ఎస్పీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు యూనిట్ లో పనిచేస్తూ గురువారం పదవీ విరమణ పొందిన హోమ్ గార్డ్ రమణమూర్తిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. పోలీస్ శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు, సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో శేష జీవితాన్ని సంతోషకరంగా గడపాలని తెలిపారు. ప్రతి రోజు వ్యాయమం అలవాటు చేసుకుని తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు వహించాలని కోరారు.

సంబంధిత పోస్ట్