మణుగూరు: గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం కిట్ల పంపిణీ
మణుగూరు జడ్పీ హైస్కూల్ లో కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచం కిట్లను ఎమ్మెల్యే పాయం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేకమంది గౌడ్ కార్మికుల రక్షణ కొరకు ఏర్పాటుచేసిన సేఫ్టీ కిట్లను ప్రభుత్వ అందించటం మంచి కార్యక్రమం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డీహీఆర్ఓ అధికారి ఇందిర,ఎంపీటీఓ శ్రీనివాస్ రావు, మణుగూరు సీఐ రాజిరెడ్డి, గౌడ సంఘం జిల్లా,మండల నాయకులు పాల్గొన్నారు.