కార్యకర్తలు ముంపు ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండండి
బూర్గంపాడు మండలం సారపాకలో శనివారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి డిసిసి మైనార్టీ అధ్యక్షులు మహిముద్ ఖాన్ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మీకు ఎటువంటి ఇబ్బంది కలిగిన వారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించాలని కోరారు.