యువకుడి అదృశ్యంపై కేసు నమోదు

70చూసినవారు
యువకుడి అదృశ్యంపై కేసు నమోదు
అశ్వాపురంలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన మిట్టకంటి దినేశ్ రెడ్డి(19) అనే యువకుడు అదృశ్యమయ్యాడు. సారపాకలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం కళాశాలకని వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి రాకపోవడంతో తల్లి రజిత కళాశాల ప్రిన్సిపలకు ఫోన్ చేసింది. వారు కళాశాలకు రాలేదని చెప్పారు. ఈ మేరకు అశ్వాపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్