అశ్వాపురం మండలం మల్లెలమడుగులో గురువారం సీపీఐ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కమటం వెంకటేశ్వరరావు పాల్గొని అరుణ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పడిన సీపీఐ వందేళ్ల చరిత్రను పూర్తి చేసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సురేశ్ పాల్గొన్నారు.