బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామపంచాయతీలో 15 రోజులుగా మంచినీళ్లు రావడం లేదని గురువారం స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడంలేదని, మంచినీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు చెప్పారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోని తమకు మంచినీరు అందించాలని స్థానిక ప్రజలు కోరారు.