కరకగూడెం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మంజూరైన నూతన అంబులెన్స్ను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం ప్రారంభించారు. గత ప్రభుత్వం ఆసుపత్రులకు అంబులెన్స్లను కేటాయించకపోవడం వల్ల అనేకమంది ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కానీ ప్రజా ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అంబులెన్సును మంజూరు చేసిందని ఎమ్మెల్యే పాయం తెలిపారు.