బూర్గంపాడు మండల పరిధిలోని గోదావరి బ్రిడ్జిపై శుక్రవారం రాత్రి లారీకి మంటలు అంటుకున్నాయి. జగనదల్ పూర్ నుంచి విజయవాడకు ఇనుప సామాగ్రి లోడుతో లారీ వెళ్తుంది. వంతెన పైకి రాగానే టైర్ పంచర్ కావడంతో రాపిడికి గురై మంటలు చెలరేగాయి. బూర్గంపాడు, భద్రాచలం పోలీసులు అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులో తీసుకొచ్చారు.