మణుగూరు మండలం లంక మల్లారంలో తెలంగాణ ట్రైబుల్ వెల్ఫేర్ అప్ గ్రేడ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల వసతిగృహాన్ని శనివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి అన్ని సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పెట్టే భోజనాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. స్టోర్ రూమ్, రికార్డ్స్ పరిశీలించారు.