బొగ్గు ఉత్పత్తిలో రక్షణకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి సూచించారు. మణుగూరు ఏరియాలో గురువారం పర్యటించిన డైరెక్టర్ ఓసీ 2, ఓసీ 4 గనులను సందర్శించారు. గనుల్లో జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి, లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. మణుగూరు ఏరియాలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని బొగ్గు ఉత్పత్తికి నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు.