బూర్గంపాడు మండలం సారపాకలో మంగళవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటించనున్నారు. సారపాక, సుందరయ్యనగర్, గాంధీనగర్, భాస్కర్ నగర్, విజయనగర్, రాజీవ్ నగర్ కాలనీలలో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.